సీఎం సానుకూల స్పందనతో దీక్షను విరమింప చేయించిన స్థానిక ఎమ్మెల్యే అబ్రహం

 

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 7 :

ఎర్రవల్లి గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలత వ్యక్త పరచినట్లు అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం తెలిపారు. మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని మండల సాధన సమితి పి. రాగన్న, కృష్ణ సాగర్, ఎరవల్లి సర్పంచ్ జోగుల రవి సమక్షంలో 10 రోజుల పాటు 14 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ ల ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఎమ్మెల్యే అబ్రహం చేరుకున్నారు. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరగా ప్రస్తుతం ఇటిక్యాల మండలం పరిధిలోని ఎర్రవల్లిను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అంతకు ముందే వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపడం జరిగిదన్నారు. శనివారం కూడా సీఎం కెసిఆర్ ని మరియు చీఫ్ సెక్రెటరీని కలిసినట్లు ఆయన చెప్పుకోచ్చారు. మండల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలు కొంత ఆలస్యం అయినందున ఎర్రవల్లిను నూతన మండలంగా ప్రకటించలేదని, రెండవ విడతలో ఎర్రవల్లిని తప్పకుండా మండలం కేంద్రగా ప్రకటిస్తారని ఆయన హామీ ఇచ్చి ఆదివారం ఎర్రవల్లి చౌరస్తాలోని ఆర్. గార్లపాడు, కారుపాకుల గ్రామం సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ మల్లేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లి దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, తెరాస పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గార్లపాడు హుస్సేన్, దేవేందర్ రెడ్డి, షేక్ పల్లె సర్పంచ్ రవీందర్ రెడ్డి, మండల వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల సాధన సమితి సభ్యులు పి రాగన్న, కృష్ణ సాగర్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.