*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొగుళ్ళపల్లి (జనంసాక్షి)సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  మండల వైద్యాధికారి డాక్టర్ జయపాల్ గురుకుల పాఠశాల  విద్యార్థులకు సూచించారు. సోమవారం మొగుళ్ళపల్లి  మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర  గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ జయపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,, కాచి వేడి చేసిన నీటినే త్రాగాలని,, బయట నుంచి వచ్చే ఆహార   పదార్థాలను తినవద్దని సూచించారు.అనంతరం గురుకుల పాఠశాలలోని  ప్లాంట్ ను, మూత్రశాలలను, మరుగుదొడ్లను, వంటశాలను, డైనింగ్ హాల్ ను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి 14 మంది నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపినట్లు డాక్టర్ జయపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ల్యాబ్ టెక్నీషియన్ దేవేందర్, శ్రీలత, అస్త్ర, వసంత తదితరులు పాల్గొన్నారు.