సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి.

– హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ
అశ్వరావుపేట అక్టోబర్ 21( జనం సాక్షి)

ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరమని హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ అన్నారు. గుమ్మడవల్లి పీహెచ్ సి ఆధ్వర్యంలో మండలంలోని రామన్నగూడెం పంచాయతీ నందు శుక్రవారం వి హెచ్ ఎన్ సి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ మన ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా దోమల కుట్టకుండా రక్షణ కొరకు దోమతెరలను విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వాంతులు విరోచనాలు కామెర్లు సోకినట్లు కనిపిస్తే డాక్టర్ల సలహాల మేరకు వైద్యం చేయించుకోవాలని తెలిపారు. దగ్గు, జలుబు,కఫం వంటి లక్షణాలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడివల్లి హెల్త్ సిబ్బంది, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు,గ్రామపంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.