సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

బర్లగూడెంలో వైద్య ఆరోగ్య శిబిరం
— సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్

టేకులపల్లి,అక్టోబర్ 21( జనం సాక్షి): సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో బర్లగూడెం గ్రామంలో ఆరోగ్య శుక్రవారం శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో వీధులు ఇంటింటికి కలియతిరిగి నీటి నిలువలను తొలగించి అనంతరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో జ్వరాలతోబాధపడుతున్న వారందరినీ వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గ్రామస్తులకు ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ దోమకాటు ద్వారా వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దృశ్యా దోమ పుట్టకుండా, కుట్టకుండా తీసుకోవాల్సిన చర్యలను మెరుగు పరుచుకోవాల్సిందిగా సూచించారు. నాగరికత పెరిగిన కొలది రకరకాల వస్తువులు వాడి నిర్లక్ష్యంగా పడేయడం జరుగుతుందని, ముఖ్యంగా ఇంటి పరిసరాలలో నిర్లక్ష్యంగా పడేసిన టైర్లు,ప్లాస్టిక్ వస్తువులు కూలర్లు, కుండలు, కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్ బాటిల్స్ వంటి మంచి నీటి నిల్వలు చేరడానికి అవకాశం ఉన్న వస్తువుల వల్ల ప్రధానంగా డెంగ్యూ,చికెన్ గున్యా కేసులు నమోదు అవుతున్నాయి అని, నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ నరేష్ ప్రజలకు సూచించారు. అలాగే పెరిగిన పెద్ద దోమలు కుట్టకుండా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటి లోపల గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు రాకుండా దోమ జాలీలు ఏర్పాటు చేసుకోమని దోమతెరలు వాడుకోవాలని, ముఖ్యంగా పగటిపూట నిండుగా బట్టలు ధరించుకోమని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే చేసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,మురుగు నీటి నిల్వలలో ఆయిల్ బాల్స్ వేసుకోవాలని ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కువ గా నమోదు అవుతున్న �

తాజావార్తలు