సీతారాముల కల్యాణం పోస్టర్ విడుదల
భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు కల్యాణ్యానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో రఘనాథ్, ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, ఏఈవో ప్రభాకర్, అర్చక స్వాములు, శ్రీరామదీక్షి సంఘం నాయకులు రేగలగడ్డ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.