సీనియర్ జర్నలిస్ట్ కు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలి.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరిన డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం.
సిరిసిల్ల. సెప్టెంబర్ 12. (జనం సాక్షి) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావుకు వైద్యం కోసం ఆర్థికంగా సహాయం అందించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ మామిండ్ల దశరథం కోరారు. బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ను కలిసి డిపిఆర్ఓ మామిళ్ల దశరథం వినోద్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. వైద్యం కోసం ఆర్థికంగా చేయూత అందించాలని కోరారు. అనంతరం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినోద్ రావు కు అందుతున్న వైద్య సేవలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో వినోద్ రావుకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వినోద్ రావు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు డిపిఆర్ఓ తెలిపారు. ఆయన వెంట సీనియర్ జర్నలిస్ట్ కాంభోజు ముత్యం ఉన్నారు.