సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ పర్యటన

వినుకొండ, జూలై 17 : సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో 15 నుండి 20వరకు పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి ఎం. వి. వరప్రసాద్‌ తెలిపారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో నిర్వహించే పర్యటనకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పట్టణ కార్యదర్శి లాల్‌ ఖాన్‌ కోరారు. ఈ నెల 21న మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరప్రసాద్‌ కోరారు. ఈ సమవేశంలో కోటయ్య, రోశయ్య, విజయమ్మ, రాము, బాబు తదితరులు పాల్గొన్నారు.