సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాంకీ, పెట్టుబడుల స్వీకరణ ఛార్జిషీట్లలో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు నిరాకరించింది. అభియోగాల నమోదును వాయిదా వేయాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్‌ ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు అంగీకరించింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించారు.