సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా
నెల్లూరు పార్లమంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రాజమోహన్‌రెడ్డి విజయభేరి
స్థానాల్లో ఫ్యాను జోరు.. రెండు స్థానాల్లో …
హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి):
వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు. టపాసులు కాలుస్తూ… స్వీట్లు పంచుతూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రానికే ఫలితాలు వెల్లడయ్యా యి. 15 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. నెల్లూరు పార్ల మెంటులోను వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి రాజ్‌మోహన్‌రెడ్డి 2,91,745 ఓట్లతో విజయం సాధించారు. మరొక 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వరంగల్ జిల్లా పరకాలలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. అని నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా పోరాడింది. అన్ని పార్టీలఅభ్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. టీడీపీ గతంలో కంటే తన ఓటింగ్ బలాన్ని మరింత పెంచుకుంది. వరంగల్ జిల్లా పరకాలలో టీడీపీ మూడోస్థానంలో నిలిచింది. నెల్లూరు పార్లమెంట్, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప సమరం జరిగిన విషయం విదితమే.
నరసన్నపేటలో – వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి ధర్మాన కృష్ణదాసు విజయం సాధించారు. పాయకరావుపేట వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్ల బాబురావు విజయం సాధించారు. రామచంద్రాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుపొందారు. పోలవరం- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి టి.బాలరాజు గెలుపొందారు. ఆయన 22 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. నర్సాపురం-కాంగ్రెస్ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి ప్రసాదరాజును ఓడించారు. కొత్తపల్లికి సుమారుగా 4700 మెజార్టీ లభించింది. ప్రత్తిపాడు- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి సుచరిత గెలుపొందింది. ఆమెకు 16 వేల మెజార్టీ లభించింది. మాచర్ల- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 15 వేల మెజార్టీతో గెలుపొందారు. ఉదయగిరి- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి మేకపాటి చంద్రశేఖరరెడ్డి గెలుపొందారు. రాజంపేట- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి అమర్‌నాధ్‌రెడ్డి గెలుపొందారు. ఆళ్లగడ్డ- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి శోభానాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఎమ్మిగనూరు- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి చెన్నకేశవరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్ధి బీవీ మోహన్‌రెడ్డిపై గెలుపొందారు. అనంతపురం- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి గుర్నాధరెడ్డి 23 వేల ఓట్లతో విజయం సాధించారు. రాయదుర్గం- వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి 32 వేల ఓట్లతో గెలుపొందారు. రైల్వే కోడూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కె.శ్రీనివాసులు గెలుపొందారు. రాయచోటి వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి.శ్రీకాంత్‌రెడ్డి విజయం సాధించారు. ఒంగోలులో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. వరంగల్ జిల్లా పరకాలలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి భిక్షపతి విజయం సాధించారు. ఆయనకు 860 ఓట్ల మెజారిటీ సాధించారు. తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి విజయం సాధించారు. 18,117 ఓట్లతో విజయం సాధించారు. అలాగే నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధిగా వైఎస్‌ఆర్‌సిపికి చెందిన రాజ్‌మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైఎస్‌ఆర్‌సిపి 15 అసెంబ్లీ స్థానాల్లోను, నెల్లూరు పార్లమెంటు స్థానంలోను విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, టిఆర్‌ఎస్ 1 స్థానం సాధించాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌పార్టీ అనంతపురం, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరంలలో ధరావత్తు కోల్పోయింది. అదేవిధంగా టీడీపీ కూడా నాలుగుచోట్ల డిపాజిట్ కోల్పోయింది. నర్సాపురం, రామచంద్రాపురం, ఆళ్లగడ్డ, రైల్వేకోడూరులలో ధరావత్తు కోల్పోయింది. టీడీపీ తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ను మూడోస్థానంలోకి నెట్టి తాను రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ప్రశాంతం.. : బన్వర్‌లాల్
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ తెలిపారు. అల్లర్లు జరిగినట్టుగా గాని, అవాంఛ నీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా గాని సమాచారం అందలేదన్నారు. రీ కౌంటింగ్ ప్రసక్తే లేదని చెప్పారు. సజావుగా సాగేందుకు సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.