సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

రాయికోడ్ జనం సాక్షి 12  రాయికోడ్ మండల పరిధిలోని నాగ్వార్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కొరకు నారాయణఖేడ్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించిన 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన నిధులతో భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి నిధుల నుండి గ్రామానికి ఎస్‌డీఎఫ్ నిధులను మంజూరు చేయించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు ఎంపీ మరియు స్థానిక ఎమ్మెల్యేకు కోఆప్షన్ మెంబెర్ అబేద్ అలీ ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు భాస్వరాజ్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, మండల కో ఆప్షన్ మెంబర్ ఆబెద్ అలి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాండు. ఉప సర్పంచ్ రాజు, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు పాండు, యూవ నాయకులు సయ్యద్, అనిల్, పంచాయతి కార్యదర్శి రాజేందర్ పటేల్, వార్డ్ మెంబెర్లు తదితరులు పాల్గొన్నారు.