సీిఐటీయూ గెలిస్తే అన్ని సంఘాలు గెలిచినట్టే
అవినీతి రహిత సంఘం సీఐటీయూ ఒక్కటే
్జకాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : కార్మికు లకు సరైన న్యాయం జరగాలన్నా, సింగరేణి సం స్థ అభివృద్ధి బాటలో పయనించాలన్నా అది కేవ లం అవినీతి రహిత సీిఐటీయూతోనే సాద్యమని రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా భిక్షమయ్య అన్నారు. శని వారం స్థానిక కాకతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులను ఏకం చేస్తూ వారి హక్కులకై పోరాటాలు చేసి వాటిని సాధించి న ఘనత ఒక్క సీఐటీయూది అని సింగరేణిలో కూడా అన్ని యూనియన్ల మాదిరిగా కాకుండా ఏవైనా కార్మికుల సమస్యలను అన్ని యూనియన్ లను కలుపుకొని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమంకోసం అవకాశం ఇవ్వాలన్నా రు. అన్ని కంపెనీలతో పోలిస్తే సింగరేణి వేరే దిశ గా పయణిస్తున్నదని ప్రతి రంగాన్ని కూడా ప్రైవ ేటు పరం చేస్తు కార్మికులను అన్యాయానికి గురిచే స్తుంన్నదన్నారు. గెలిచిన సంఘం సమస్యల సాధ నకై కృషిచేయాలని సూచించారు. సీఐటీయూ అన్ని సంఘలను కలుపుకుపోయి కార్మికుల హ క్కులసాధనకు కృషి చేస్తుందని చెప్పారు. సకల జనుల సమ్మె కాలంలో అన్ని సంఘాలు కలసి క ట్టుగా లేవని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ స్వప్రయోజనాలకు పెద్దపీట వేసుకున్నారని విమర్శించారు. సకల జనుల సమ్మెను కూడా ప్ర భుత్వంతో లాలూచి పడి, కేవలం ఏఐటియుసి అవగాహనా రాహిత్యంతో ఎలాంటి ఒప్పందం లే కుండానే సమ్మెను విచ్చిన్నంచేసి కార్మికులను నష్ట పరిచారని విమర్శించారు. సమ్మె కాలంలో ఏఐటీ ీయూసీ నాయకులు కొత్తగూడెం గనులలో మస్టరు పడి విధులు నిర్వహించకుండ బయటకివచ్చి జై తెలంగాణ అన్నారని, సమ్మెను అడ్డంపెట్టుకొని ఆ నాయకులు కార్మికుల దగ్గరినుంచి, పైరవీలు చేసి కోట్ల రూపాయలను దండుకున్నారని విమర్శించా రు. అందుకే ప్రభుత్వం అన్ని సంఘాల నాయ కులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి యూనియన్‌లో కూడా అవినీతి ఉం దని కార్మికులకు మోసపూరిత మాటలు చెప్పి వా రిని నష్ట పరుస్తున్నారని అన్నారు. రానున్న సింగ రేణి ఎన్నికలల్లో కూడా అవినీతి రాజకీయం జరు గుతుందని ఓట్ల కోసం కార్మికులను లో బర్చుకోవ డానికి డబ్బులు, మద్యం పంపిణి చేస్తున్నారని అ న్నారు. ఇలాంటి అవినీతి రాజకీయాలకు సీిఐటీ యూ దూరంగా ఉంటుందని కార్మికులు గ్రహించి వారి హక్కులు కావాలో లేక నాయకుల జేబులు నిండాలో ఆలోచించుకోవాలని అన్నారు. సీిఐటీ యూ గెలిస్తే యాజమాన్యం ఓడినట్టని వేరే సం ఘం గెలిస్తే యాజమాన్యం గెలిచినట్టని అన్నారు. ఎందుకంటే సీిఐటీయూ గెలిస్తే అన్ని సంఘాలను కలుపుకోని యాజమాన్యంతో కార్మికుల సమస్యల ను పరిష్కరించేలా ఒప్పందాలను ఖచ్చితంగా కు దుర్చుకుంటుందని, వేరే సంఘం ఏది గెలిచిన యాజమాన్యంతో కుమ్మక్కై హక్కులను అమ్ము కుంటాయని ఎద్దేవ చేశారు. ఈ సమావేశంలో సీి ఐటీయూ రాష్ట్రఉపాధ్యక్షులు బందు సాయిలు, బ్రాంచి కార్యదర్శి కంపేటి రాజయ్య, బ్రాంచి కో శాధికారి వెంకయ్య, మల్లయ్య రమేష్, రాము, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.