సుంకేసుల కు భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో
అక్టోబర్ 13(జనం సాక్షి)
రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ఉన్న ప్రాజెక్టు ల నుండి వస్తున్న నీరు, డ్యామ్ ఎగువ భాగాన ఉన్న వాగులు వంకల ద్వారా వస్తున్న నీటితో పాటు కురుస్తున్న వర్షాలతో డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.గురువారం ఎగువ నుండి 1,23 వేల 115 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 25 గేట్లను తెరిచి 1,21 వేల185 క్యూసెక్కిల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం కి వదిలినట్లు జేఈ రాజు తెలిపారు. కేసీ కెనాల్ కు 1,930 క్యూసెక్కిల వదిలింట్లు ఆయన పేర్కొన్నారు.