సురేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఘననివాళి
– అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి
మోర్తాడ్, వేల్పూర్,ఆగస్టు 28(జనంసాక్షి):అనారోగ్యంతో మరణించిన టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంతక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం వేల్పూర్‌లో నిర్వహించగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తండ్రి అయిన సురేందర్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వేల్పూర్‌కు చేరుకుని సురేందర్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సురేందర్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సీం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రాజ్యసభ సభ్యులు కేశవరావ్, డి శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌షిండే, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.