సుశాంత్‌ది ఆత్మహ్యతేనని నిర్ధారించిన పోస్టమార్టమ్‌

ఆత్మహత్యకు గ కారణాపై పోలీసు ఆరా
ముంబై,జూన్‌15(జ‌నంసాక్షి): ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ హీరో
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ పూర్తయ్యింది. అతనికి పోస్ట్‌మార్టమ్‌ చేసిన డా. ఆర్‌ఎన్‌ కూపర్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యు సోమవారం పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను విడుద చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్యగానే ధృవీకరించారు. అయితే అవయవాల్లో విషపూరితాు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాను జేజే ఆసుపత్రికి తరలించారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయిన విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఆయన ఆత్మహత్యకు గ కారణాను పోలీసు ఆరా తీస్తున్నారు. సుశాంత్‌ సూసైడ్‌ చేసుకున్నట్లు ముంబై పోలీసు చెబుతున్నారు. కానీ ఆ హీరో మరణంపై కొందరు అనుమానాు వ్యక్తం చేస్తున్నారు. కాగా 34 ఏళ్ల వయసులోనే సుశాంత్‌ తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అతని ఇంట్లో ముంబై పోలీసు యాంటీ డిప్రెషన్‌ మందును స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్‌ నోట్‌ కనిపించలేదు. మరోవైపు ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసింది. సుశాంత్‌ కుటుంబీకు వారి స్వస్థమైన పాట్నా నుంచి ముంబైకు చేరుకున్నారు. ఇదిలా వుండగా రెండేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్‌ ’కిసీ దేశ్‌ మే హై మేరా దిల్‌’ సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం ’కాయ్‌ పో చె’ (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అలా ’శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ’పీకే’, ’డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ బక్షి’ చిత్రాు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ’ఎం.ఎస్‌. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా ’చిచోర్‌’ చిత్రంలో కనిపించాడు. సిబిఐ విచారణ చేయాన్న పప్పూయాదవ్‌
సుశాంత్‌ను మర్డర్‌ చేశారని జన్‌ అధికార్‌ పార్టీ చీఫ్‌ పప్పూ యాదవ్‌ ఆరోపించారు. పాట్నాలోని సుశాంత్‌ ఇంటికి వెళ్లిన పప్పూ యాదవ్‌.. అక్కడ విూడియాతో మాట్లాడారు. హీరో సుశాంత్‌.. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదన్నాడు. సుశాంత్‌ మరణం కేసులో సీబీఐ విచారణ చేపట్టాని ఆయన డిమాండ్‌ చేశారు. పాట్నాలో ఉన్న సుశాంత్‌ కుటుంబసభ్యు కూడా హీరో మృతి పట్ల అనుమానాు వ్యక్తం చేశారు. సుశాంత్‌ సూసైడ్‌ చేసుకున్నట్లు మేం భావించడం లేదని ఆ హీరో బాబాయ్‌ తెలిపారు. సుశాంత్‌ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. మా వాడిని మర్డర్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఎంఎస్‌ ధోనీ, చిచ్చోరే, కేదార్‌నాథ్‌, సోంచిడియా లాంటి ఫేమస్‌ చిత్రాల్లో సుశాంత్‌ హీరో పాత్ర పోషించాడు.