సూరంపల్లిలో ఐకేసీ సభ్యుల అందోళన
దౌల్తాబాద్ గ్రామీణం : మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట సంధర్బంగా సూరంపల్లిలోనిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి ఐకేసీ సభ్యులను అనుమతించలేదు దీంతో మహిళలు రోడ్డుపై భైఠాయించి అందోళనకు దిగారు. కేవలం 300 మందికి మాత్రమే పాసుల ఇచ్చి లోపలికి అనుమతించడంతో పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు బయటే నిలిచిపోయారు. తమను కూడా అనుమతించాలని అందోళనకు దిగడంతో పోలిసులు వారిని బయటకి నెట్టివేశారు.