సృష్ట మైన హామీతో విధుల్లోకి చేరిన వీఆర్ఏలు
నాగిరెడ్డిపేట్ 13 అక్టోబర్ జనం సాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా 80 రోజుల పాటు నిరవధిక సమ్మె చేపట్టిన వీఆర్ఏలు గురువారం విధుల్లో చేరారు. వీఆర్ఏ లకు పేస్కేల్ అమలు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ 80 రోజుల పాటు సుదీర్ఘంగా నిరవధిక సమ్మెలు చేపట్టారు. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సభ్యులు బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో చర్చలు జరపడంతో ప్రభుత్వం వచ్చే నెల ఏడో తేదీ వరకు వీఆర్ఏల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుందని, అంత వరకు తిరిగి విధుల్లోకి చేరాలని సూచించడంతో, రాష్ట్ర వీఆర్ఏ జెఎసి, జిల్లా జెఎసి ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట్ మండల వీఆర్ఏలు సమ్మెను విరమించి విధుల్లోకి చేరుతున్నట్లు తహశీల్దారు సయీద్ అహ్మద్ మస్రూర్ కు గురువారం హామీ పత్రాన్ని అందజేసి విధుల్లోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area