సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
పెద్దపల్లి ,నవంబర్17(జనంసాక్షి): ఇందిరానగర్ ఎఫ్సీఐలో సెక్యురిటి గార్డ్‌గా పనిచేస్తున్న తోట వినోదకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 21సంవత్సరాలు. ఉదయం డ్యూటీ కి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వినోదకుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా 1టౌన్ ఎసై తోట వేకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గలా వివరాలు కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.