సెప్టెంబర్‌లో


బీచ్‌ వాలీబాల్‌ పోటీలు
` మంత్రి వట్టి వసంతకుమార్‌
హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : సెప్టెం బర్‌లో బీచ్‌ వాలీబాల్‌ పోటీలు జరగను న్నాయి. విశాఖపట్నం వేదికగా ఈ పోటీలు జరగనున్నట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లా డుతూ ఇండియన్‌ ఓపెన్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారన్నారు. పురుషుల, మహిళల జట్లు ఈ టోర్నీలో తల పడనున్నాయన్నారు. మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాలు పంచుకోనున్నట్టు వెల్లడిరచారు.