సెప్టెంబర్ 16న ములుగులో జరుగు తెలంగాణ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :-
పస్రాలో జరిగిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుండి 51 వరకు జరిగిందని ఈ పోరాటం ప్రధానంగా నైజాం రజాకార్లు కు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా నీ బాంచన్ కాల్మొక్త వెట్టిచాకిరి వ్యతిరేకిస్తూ సాగిన ఈ పోరాటంలో 4,000 మంది కార్యకర్తలు అమరులయ్యారని అలాంటి పోరాటాన్ని నేడు బిజెపి విమోచన పోరాటం అని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా భావిస్తూ చరిత్ర ను వక్రీకరిస్తూ తెలంగాణలో విమోచన దినోత్సవం జరపాలని పేర్కొనడం చరిత్రను  వక్రీకరించడమేనని పేర్కొన్నారు.ప్రజలు కమ్యూనిస్టులు పోరాటాన్ని నాలుగువేల గ్రామాల విముక్తి చేస్తూ 10 లక్షల ఎకరాలు పంచి భూమికోసం భుక్తి కోసం జరిగిన పోరాటంలో మరణించిన అమరవీరులను స్మరిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో ఈ నెల 16న జరుగు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి,జిల్లా కమిటీ సభ్యుడు పొదిల్ల చిట్టిబాబు, గుండు రామస్వామి, గుంది రాజేష్ ,అంబాల మురళి సాంబ చంద్రారెడ్డి, కన్నోజు సదానందం, సప్పిడి ఆదిరెడ్డి తదితరులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.