సెరెనా విలియమ్స్‌పై
లండన్ : సెరెనా విలియమ్స్‌పై మారియా షరపోవా ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం వింబుల్డన్ ప్రారంభం కాకముందే మైదానం వెలుపల వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. తన ప్రియుడిపైన వ్యాఖ్యలు చేసిన సెరెనా విలియమ్స్‌పై షరపోవా నిప్పులు చెరిగారు. ఇటీవల అమెరికాలో జరిగిన అత్యాచార సంఘటనపై సెరెనా వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టింది. ఓహియా నగరంలో పదహారేళ్ల అమ్మాయిని అమెరికన్ ఫుట్ బాల్ ఆటగాళ్లు అత్యాచారం చేశారు. ఈ సంఘటనలో అమ్మాయిదే తప్పు అన్నట్లు సెరెనా మాట్లడగా పలు విమర్శలు తలెత్తాయి. దీంతో ఆమె దిగి వచ్చి క్షమాపణ చెప్పింది. ఓహియో కేసు విషయంలో సెరెనా వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఇతర విషయాల్లో తలదూర్చడం సరికాదని మండిపడింది. తన వైపు దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వివాదాలు సృష్టించడం మామూలేనని ఎద్దేవా చేసింది. షరపోవా ప్రస్తుతం ప్రియుడైన బల్గేరియా టెన్నిస్ ఆటగాడు దిమిత్రోవ్ సెరెనా మాజీ ప్రయుడట.. దీంతో షరపోవా ప్రేమాయణంపై సెరెనా వ్యాఖ్యలు చేసింది. దిమిత్రోవ్‌లాంటి చెడ్డ వ్యక్తితో షరపోవా తిరుగుతోందని అర్థం వచ్చేలా సెరెనా మాట్లాడింది. దీనికి సమాధానంగా షరపోవా తన ప్రేమ గురించి మాట్లాడడమెందుకని ప్రశ్నించింది.