సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మహిళ మృతి
దౌల్తాబాద్, జనంసాక్షి మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.