సెస్ లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి.
భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 13. (జనం సాక్షి) సహకార విద్యుత్ సంస్థ సెస్ లో జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని భారతీయ కిసాన్ సంఘ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. గురువారం రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..
సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు సెస్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల నిర్వాకం వల్ల రైతులపై అదనపు భారం పడుతుందని అన్నారు. గ్రామాలలో శ్రమదానం, కాంట్రాక్టర్ పేరుతో ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కు 50 వేల పైచిలుకు వసూలు చేయడంపై మండిపడ్డారు. అధికారుల ఇష్టరాజ్యం గా , అక్రమాలకు నిలయంగా సెస్ మారిందని ఈ విషయంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.
ఈ ఆర్ సి మీటింగ్ క్యాన్సిల్ చేయడం జరిగిందని తక్షణమే సమావేశం జరపాలని డిమాండ్ చేశారు.
సెస్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు.