సేవలకు గుర్తింపు కోసమే రీజన్ కాన్ఫరెన్స్ లు.
వాసవి క్లబ్ అంతర్జాతీయ అదరపు కోశాధికారి దొడ్డ మోహన్ రావు.
బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి) వాసవి క్లబ్ స్థాయిల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సాహక అందించడం కోసమే రీజియన్ స్థాయిలో ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ అదరపు కోశాధికారి దొడ్డ మోహన్ రావు అన్నారు . ఆదివారం రాత్రి బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ రీజియన్ వన్ ప్రాంతీయ సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధ్వర్యంలో రీజన్ కాన్ఫరెన్స్ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి క్లబ్ క్లబ్ స్థాయిలో అధ్యక్ష కార్యదర్శులు అధికారులతో పాటు సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని వీటికి సరైన గుర్తింపు కోసం ప్రాంతీయ సదస్సుల్లో అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా జిల్లా స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాసవి క్లబ్ కార్యదర్శి రవిచంద్రన్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు పేదలకు రీజియన్ చైర్మన్ పెద్ది రాజేందర్ వస్తదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు సీనియర్ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ , జిల్లా గవర్నర్ బాల సంతోష్ , కార్యక్రమం అబ్జర్వర్ పుల్లూరి బాల మోహన్, క్యాబినెట్ సెక్రటరీ బోనగిరి వేణుగోపాల్ తో పాటు రీజనల్ పరిధిలోని అన్ని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు కోశాధికారులతో పాటు సభ్యులు పాల్గొన్నారు