సేవాలాల్ భవనం కాదు మా పిల్లలు డాక్టర్లు కావాలి…

 

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సేవాలాల్ భవనం కాదు మా పిల్లలు డాక్టర్లు కావాలి…

రామోజీ ఫిల్మ్ సిటి భూములు అటవీ భూములు కావా?
పోడు భూములకు పట్టాలిచ్చే పార్టీ బిఎస్పి.

డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ

నారాయణపూర్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
మునుగోడు నియోజకవర్గంలోని గిరిజనులందరిని బస్సుల్లో తీసుకెళ్ళి హైదరాబాద్ లోని సేవాలాల్ భవనం చూసిన్తున్నారని,కానీ ఆ భవనాల వల్ల గిరిజనుల బతుకులు మారవని,కేవలం విద్య ద్వారానే పేద గిరిజనుల బతుకులు మారుతాయని,దమ్ముంటే గిరిజన బిడ్డలను డాక్టర్లు ఇంజనీర్లుగా తయారుచేయాలని డిమాండ్ చేశారు.అమిత్ షా మీటింగ్ ఒక్కొక్కరికి ఐదు వందలు,కెసిఆర్ మీటింగ్ కు రెండు వందల చొప్పున ఇచ్చి గిరిజనులను మీటింగ్ కు తీసికెళ్ళారని, ఆ డబ్బంతా ఎక్కడిదని ప్రశ్నించారు. వారం రోజుల్లో గిరిజన బంధు,గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి పది రోజులు దాటినా కెసిఆర్ జాడ లేదని విమర్శించారు.గిరిజనులకు పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించి,ఎందుకివ్వడం లేదన్నారు.అటవీ అధికారులకు,ప్రభుత్వానికి పేదల భూములే కనిపిస్తున్నాయా?అటవీ ప్రాంతంలోని ధనవంతులకు మాత్రం పట్టాలు ఎలా వచ్చాయన్నారు.రామోజీ ఫిల్మ్ సిటి భూములన్ని ప్రభుత్వ,అటవీ భూములు కాదా అని నిలదీశారు.అటవీ అధికారులు ఆ భూముల్లో కంచె వేయగలరా అని ప్రశ్నించారు. బహుజన రాజ్యంలో బిఎస్పి పాలనలో పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.వంద ఏళ్ళ నుండి సాగుచేసికునే భూములు వారివి కాకుండా ఎలా పోతాయన్నారు..అంతేకాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మలావత్ పూర్ణ లాంటి వారిని ఊరూరా తయారుచేస్తామన్నారు.
బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 125వ రోజు వెంకంబావితండ,తుంబాయితండ,రాచకొండ,కడీలబాయి తండ,ఐదుదోనల తండ,ఏడుబోనాల తండాలో పర్యటించారు.రాచకొండలోని లక్ష్మీనరసింహస్వామి,స్వయంభు శంభులింగేశ్వరాలయాన్ని సందర్శించారు.మేమే రాజకీయాల్లోకి సంపదకోసం రాలేదని,పేదలకు సంపదను పంచివ్వడానికే రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు.
గిరిజన తండాల ప్రజలు హైదరాబాద్ లో కూలీలుగా,ఆటో డ్రైవర్లుగా,పనిచేస్తున్నారని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.గిరిజన పంచాయితీలకు నిధులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు.
గిరిజన మహనీయులు సేవాలాల్,హథీరాం,తుల్జాభవానీలు కోరుకున్న రాజ్యం రావాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలన్నారు.మన పిల్లలు విమానంలో వెళ్లి విదేశాల్లో చదవాలంటే ఏనుగును గెలిపించాలని కోరారు.ఒక్కరోజు డబ్బు ఇచ్చే వారు కాదు,నెలకు లక్షల జీతం ఇచ్చే వారిని గెలిపించాలని సూచించారు. ఈరోజు యాత్రలో పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్,జిల్లా నాయకులు ఏర్పుల అర్జున్,మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి ఐతరాజు అబేందర్,మహిళా కన్వీనర్ కత్తుల పద్మ,పోకల ఎలిజబెత్,శంకరాచారి,రమావత్ రమేష్ నాయక్,మహేందర్ నాయక్, కత్తుల నర్సింహ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.