సైకో ఛాయాచిత్రాల వివరాల సేకరణ

ఉలవపాడు వెళ్ళిన పోలీసులు
నెల్లూరు, జూలై 28 : తడమండలం భీమునివారి చెక్‌పోస్టు వద్ద గురువారం నాడు ముగ్గురు వ్యక్తులను కీరాతకంగా హత్య చేసిన సైకో ఛాయా చిత్రానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు శనివారం నాడు డిఒఎస్‌ఇ నరసింహకిషోర్‌ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందం ప్రకాశం జిల్లాలోని ఉలవపాడుకు వెళ్ళింది. ఈ సంఘటనలో గాయపడి ప్రాణాలతో బయటపడిన రమేష్‌ అనే వ్యక్తి అతి సమీపం నుంచి సైకోను చూచినట్టు, అతడు వెల్లడించిన, ఆధారాలతో కూడిన ఊహాచిత్రాన్ని రూపొందించాలని పోలీసులు భావించారు. అయితే గత రెండురోజులుగా సూళ్లూరుపేటలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం అతడిని ఆసుపత్రి నుంచి పంపించారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడిందని మాట్లాడుతున్నందున శనివారం నాడు పోలీసు బృందాలను ఉలవపాడుకు పంపుతున్నట్లు ఎస్పీ బివి రమణకుమార్‌ తెలిపారు. ఆధారాలు సేకరించగానే, ఊహచిత్రాన్ని రూపొందిస్తామని అన్నారు.

తాజావార్తలు