సైనిక కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం… జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

బయ్యారం, ఆగస్ట్ -19(జనంసాక్షి):

సైనిక కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు
జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి బయ్యారం మండల కేంద్రంలో PACS కార్యాలయం వద్ద భారత ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్న జవానుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనీ, ఫ్రీడమ్ ఫైటర్స్ వారి త్యాగాల మూలంగానే మనం ఈ రోజు మాట్లాడు కుంటున్నాం అని, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకు వెళుతుందని, ప్రక్క దేశాలతో ఎటువంటి ఆపద రాకుండా కుటుంబాలను సైతం లెక్క చేయకుండా, ఈ మండలంలో ఒక కుటుంబం నుండి ఇద్దరు కూడా అర్మిలో దేశ రక్షణకు వెళ్లారని, ప్రాణాలకు తెగించి దేశ రక్షణకు పాటు పడుతున్నారని, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ మీ కుటుంబంలో ఒక ఆడ బిడ్డగా అండగా ఉంటానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, రెండు వారాలుగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలను జరుపుకుంటున్నామని, 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారత దేశాన్ని ఇన్ని సంవత్సరాలు ప్రక్క దేశాల నుండి కాపాడుతున్న సైనిక కుటుంబాలను గౌరవించుకోవడం సముచితం అని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందని, 16 మండలాలలో బయ్యారం నుండే దాదాపు 52 మంది ఉన్నారని, ఇంకా కొంతమంది పేర్లు రాయాల్సి ఉన్నదని తెలిపారని, మండలాల వారీగా డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్న వారి వివరాలను నమోదు చేయాలని, 75 ఏళ్లుగా భారత దేశ భూ భాగాన్ని అన్ని వైపులా నుండి కాపాడుతున్న వారు దాదాపు 15 లక్షల మంది ఈ రోజు దాంట్లో ఉన్నారని, అప్పట్లోనే జై జవాన్, జై కిసాన్ అని స్లోగన్ ఇవ్వడం జరిగిందనీ, ఈ దేశానికి రైతు ఎంత ముఖ్యమో, అవసరమో జవాన్ కూడా అంతే ముఖ్యమని, వారిని గౌరవించుకోల్సిన అవసరం ఉందన్నారు. అమృత రెడ్డి తన ఇద్దరు కొడుకులను దేశ రక్షణకు పంపించి, మరికొందరు ఇందులో రావాలని తెలపడం సంతోషకరమైన విషయం అని అన్నారు. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా త్యాగాలు చేశారు కాబట్టే ఈ రోజు మన దేశం కాపడబడుతుందని, గర్వంగా, ధైర్యంగా ప్రపంచంలోనే మన దేశ సైన్యం అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది అని తెలిపారు. మీ కష్టానికి మేము చేసేది చిరు సత్కారం అని, సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మీ త్యాగాన్ని మేము భర్తీ చేయలేక పోయిన, ఐఎఎస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రత్యక్షంగా చూడడం జరిగిందని, ప్రతి రోజూ వారి జీవితాన్ని ఫణంగా పెట్టీ ఉద్యోగంలో బాధ్యతగా ముందుకు వెళుతున్నారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ గా మీకు హామీ ఇవ్వగలిగినది సర్వే ఆఫీసర్స్ కు సంబంధించి ఏదైనా లాండ్ డిస్ప్యూట్ ఉంటే ఖచ్చితంగా తన దృష్టికి తీసుకొని రావాలని, వాటిలో సానుకూల చర్యలు, పరిష్కారం అయ్యేటట్లు మేము చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ విషయంలో లాండ్ ఎన్. ఓ.సి విషయంలో కూడా పరిష్కారించి, మీరు చేసే దేశ సేవకు ఎది కూడా సరి తూగదని, సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని తెలిపారు

ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, స్వేచ్ఛగా ఉన్నామంటే ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాల వలననే అని, ట్రైనింగ్ లో ఒక వారం రోజులు వెళ్లి వచ్చా నని, 24 గంటలు అలెర్ట్ గా ఉండి కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి మన దేశం సెక్యూర్ గా ఉందని తెలిపారు. ఆర్మీ జవాన్లు చేసే త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా భారత ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్న జవానుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్, జిల్లాధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొననున్నారు.