సైన్యంలో పనిచేసి వచ్చా

2

– బెదిరింపులకు భయపడను

– కుట్రల్ని బయటపెడతా

– ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌ ,ఆగస్టు 24(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాళ్లపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న

ఒప్పందం పూర్తిగా దగా అని ఆయన అన్నారు. మహా ఒప్పందంలో కుట్రల్ని రేపు బయటపెడతామని ఉత్తమ్‌ అన్నారు.బుధవారం సాయంత్రం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ…ఇదో మహా దగా ఒప్పందం అని అభివర్ణించారు. కేసీఆర్‌ చెబుతున్నవి కాకిలే అని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను సైన్యంలో పని చేసి వచ్చానని, ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేది లేదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. విషయాన్ని కేసీఆర్‌ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.టెండర్ల ప్రక్రియలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. విపక్షాన్ని లేకుండా చేస్తామని చెప్పడం, కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.  తెలంగాణ భవిష్యత్‌ ను తాకట్టుపెట్టి సంబరాలు చేసుకుంటారా? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కేసులు పెట్టి జైలుకు పంపుతామనడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను బయటపెట్టాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.’152 విూటర్లకు తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రంతో ఒప్పందం కుదిరిందని

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఇంకా 40 నిమిషాలపాటు నేను బేగంపేట ఎయిర్‌పోర్టులోనే ఉంటాను. నీకు దమ్ముంటే ఆ ఒప్పంద కాగితాన్ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు రా. నేను ఇక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తాను. రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాలుపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పదింస్తూ ప్రెస్‌ విూట్‌ పెట్టారు.