సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12 (జనం సాక్షి):మణుగూరు ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో మణుగూరు ఎస్సై బి. పురుషోత్తం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ ఆధునిక సమాజంలో అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్న తరుణంలో మోసగాళ్లు, దొంగలు సైతం తమ విధానాన్ని మార్చి బ్యాంక్ ఎకౌంట్లో నుండి దొంగతనాలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్త అవసరమని సూచించారు. కొంత నిర్లక్ష్యం ప్రదర్శించినా బ్యాంక్ అకౌంటు ఖాళీ చేసే విధంగా నేరగాళ్లు తయారయ్యారని వారి పట్ల జాగ్రత్త అవసరమని అన్నారు. నేరాలకు పాల్పడే విధానాలను తెలుసుకొని వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా కోట్ల రూపాయల లో లాటరీలు, బహుమతుల రూపంలో ధనం వస్తుందని ఓటిపిలు చెప్పాలంటూ ఆశ చూపిస్తున్నారు తొందరపడి ఫోన్ చేసి ఓటిపి చెప్తే ఎకౌంట్ ఖాళీ చేస్తున్నారని దీని పట్ల జాగ్రత్త అవసరమని తెలిపారు. డబ్బులు ఎవరు ఉచితంగా ఇవ్వరు కష్టపడి సంపాదిస్తేనే వస్తాయి ఉచితంగా వచ్చే వాటికి ఆశపడి మోసపోవద్దని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుకున్న మేధావులను సైతం చిన్ని ఆశ చూపి ధనాన్ని మొత్తాన్ని కొల్లగొడుతున్న సైబర్ క్రైమ్ ల మీద విద్యార్థులు అవగాహన కలిగి ఉండి సమాజంలో జరిగే నష్టాలను కొంతవరకు నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ,పోలీసులు పాల్గొన్నారు.