సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ ఐ రమణారెడ్డి.
మండలంలో పలుచోట్ల అవగాహనా సదస్సులు…
బూర్గంపహాడ్ అక్టోబర్ 13 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కేంద్రం ప్రధాన కూడలిలో, మండల పరిధిలో పలుచోట్ల స్థానిక ఎస్సై రమణారెడ్డి యువతకు, ఆటో డ్రైవర్లకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమణారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల గురించి, సైబర్ క్రైమ్ ఎవెరనెస్, ట్రాఫిక్ రూల్స్, పట్టణంలో జరుగుతున్న అక్రమాల పలు మోసాల గురించి వివరించారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడిపెటప్పుడు హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకోవాలని, త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పాపయ్య, కానిస్టేబుల్ నాయుడు, రవికుమార్ యువత కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.