*సైబర్ నేరాలపై పై మహిళ సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం
భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మండలం లోని అన్ని గ్రామాల మహిళా సంఘాల సబ్యులకు బుధవారం నాడు భీంగల్ లోని ఐకేపీ కార్యాలయంలో అన్ని గ్రామ సంఘ మహిళలలకు భీంగల్ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భీంగల్ ఏస్ఐ రాజ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యులు తమ పిల్లలకు సెల్ ఫోన్ వాడకం, గంజాయి, బైక్ రైడింగ్ గురించి వివరించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం అవగాహనా ఉన్న వారు మాత్రమే వాడాలని బ్యాంకు నుండి వినియోగ దారులను ఎటువంటి ఓటీపీ అడగరు అని ఓటీపీ నంబర్ చెబితే బ్యాంకు ఖాతా నుండి డబ్బులు ఖాళీ అవుతాయని అన్నారు. అలాగే గ్రామాల్లో పిల్లలు గంజాయికి బానిస అవుతున్నారని అన్నారు. వారిని తల్లి దండ్రులు కనిపెట్టాలని అలాగే మైనర్ లు బైక్ రైడింగ్ చేస్తూ ప్రమాధాలకు గురి అవుతున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం కుంట శ్రీనివాస్,మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలత, సీనియర్ సిసి లుపురస్తు నరేష్, గంగాసాయిలు,ఐకేపీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.