సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
నర్సంపేట ఏసిపి సంపత్ రావు
నల్లబెల్లి ఆగస్టు 8 (జనం సాక్షి):
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఏసిపి సంపత్ రావు పేర్కొన్నారు. మండలంలోని మెడపెల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఉమెన్ సేఫ్టీ, రోడ్డు ప్రమాదాల వంటి అంశాలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేయాలన్నారు. మొబైల్ ఫోన్లో వచ్చే మెసేజ్ లకు విద్యార్థులు ఆకర్షితులై మోసపోవద్దన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, నల్లబెల్లి ఎస్సై రాజారాం పాల్గొన్నారు.