సోంపూర్,టాక్లి,వల్భాపూర్ గ్రామాలను కోటగిరి మండలంలోనే కొనసాగించాలిని కోరుతూ అర్.డి.ఓ కి వినతి పత్రం అందజేత
కోటగిరి జూలై జనం సాక్షి:- కోటగిరి మండల పరిధిలోని పోతంగల్ గ్రామాని నూతన మండల కేంద్రంగా ఎర్పాటు చేయాలని పోతంగల్ గ్రామం,దాని సమీప గ్రామాల ప్రజలు గత కొన్ని ఎండ్లుగా చర్చలు,సమ్మెలు,దీక్షలు నిర్వహిస్తున్నారు.తెరాస ప్రభుత్వం రెండు సార్లు పరిపాలన పగ్గాలను చేపట్టి,రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం పరిపాలనను ప్రజలకు వికేంద్రీకరణ చేయాలనే లక్షంలో భాగంగా రెండు సార్లు నూతన మండలాల ఏర్పాటుకు సంబంధిత జీవోలను విడుదల చేసింది.ఈ జీవోలో రెండు సార్లు కూడా పోతంగల్ నూతన మండల కేంద్రంగా ఏర్పాటు కాలేదు.ఈ తరుణంలో పోతంగల్,దాని సమీపంగా ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు,
ప్రజా ప్రతినిధులు,నాయకులు అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోతంగల్ ని నూతన మండల కేంద్రంగా ఎర్పాటు చేయాలని కోరుతూ ప్రజల నుండి ఉవ్వెత్తున ఉద్యమాలు సమ్మెలు,కొనసాగుతున్నాయి.ఇలా ఒక వైపు పోతంగల్ మండలం ఎర్పటుకై సమ్మెలు జోరుగా జరుగుతున్న వేల,కొన్ని గ్రామాల ప్రజల నుండి పోతంగల్ మండల ఏర్పాటుకై ఊహించని షాక్ తగిలింది.రాష్ట్ర ప్రభుత్వం పోతంగల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే మాత్రం సొంపూర్,టాక్లి,వల్భాపూర్ గ్రామాలను కోటగిరి మండలంలోనేకొనసాగించాలని ప్రజలందరు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు.అదేవిధంగా ఈ మూడు గ్రామాల ప్రజలు,ప్రజా ప్రతినిధులు బోధన్ రెవిన్యూ అధికారి అర్.డి.ఓ రాజేశ్వర్ కి వినతి పత్రం కూడా సమర్పించారు.ఈ సందర్భంగా పోతంగల్ మండల విషయమై ఆయా గ్రామాల ప్రజల మధ్య జరుగుతున్న భిన్న అభిప్రాయాలతో కోటగిరి మండలంలో మరో నూతన మండలం ఏర్పాటు అవుతుందా లేదా అనే విషయమై మండల పరిధిలో హాట్ టాపిక్గా మారింది.
Attachments area