సోనాపూర్ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.