సోనియా అల్లుడికి హర్యానా సర్కార్‌ క్లీన్‌చీట్‌

చండీగఢ్‌,అక్టోబర్‌ 26(జనంసాక్షి) :

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్‌ వాద్రా చేసిన భూలావాదేవీలలో తప్పేమీ జరగలేదని గుర్‌గాంవ్‌, ఫరీదాబాద్‌, పాల్వాల్‌, మేనాట్‌ డిప్యూటీ రెవెన్యూ కమిషనర్‌లు నివేదిక సమర్పించారు. తన బదిలీ జరిగే ఒక రోజు ముందుగా ఐఎఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్నా అక్టోబర్‌ 2న పై డిప్యూటి కమిషనర్‌లను 2005నుంచి వాద్రా భూలావాదేవీలపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఆయన చేసిన భూలావాదేవీలలో భూమి విలువను తక్కువచేసి కొను గోలు చేసిన దాఖాలాలు లేవని పాల్వాల్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌సింగ్‌ దాహియా తెలిపారు. హసన్‌పూర్‌ గ్రామంలో 74ఎకరాల భూమిని వాద్రా కొనుగోలు చేశారు. అన్ని డాక్యూమెంట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే రిజిస్టర్‌ చేశారు. స్టాంప్‌ డ్యూటీ కూడా సక్రమంగానే చెల్లించారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని గుర్‌గాంప్‌ డిసి సమర్పించిన నివేదికలో వెల్లడించారు.