సోమారపుకు మద్దతుగా 34వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం


గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) :
రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా ఆదివారం రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 34 వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు దొమ్మేటి వాసు, రంగు బ్రహ్మం  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే విధంగా మన రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. 34 వ డివిజన్‌లో ప్రచారం చేసినారు 34 వ డివిజన్‌ ప్రజలు ప్రచారానికి సానుకూలంగా స్పందించి కారు గుర్తుకు ఓటు వేస్తామని  హామీ ఇచ్చారు. సోమారపు సత్యనారాయణ వల్లనే రామగుండం నియోజకవర్గం అభివ ద్ధి చెందుతుందని మహిళలు పురుషులు,  సీనియర్‌ సిటిజన్స్‌ యూత్‌ సోమారపు సత్యనారాయణ గెలుపు కోసం క షి చేస్తామని పేర్కొన్నారు. 34 వ డివిజన్‌ ప్రజలు మా డివిజన్‌ కార్పొరేటర్‌ అయిన కోరు కంటి విజయ చందర్‌ గత 12 సంవత్సరాల నుంచి కార్పొరేట్‌ స్థాయిలో ఉండి కూడా డివిజన్‌ ఏమీ అభివద్ధి చేయలేదని ఈసారి మేము మోస పోమని చెప్పినారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాల నాయకులు గోపాల్‌ రెడ్డి, రాజి రెడ, భాగ్యం చంద్రమోహన్‌, కమలాకర్‌, రమేష్‌, నాగరాజు,  రవి, శ్రీధర్‌, తిరుపతి, చాణిక్య, భాస్కర్‌, శ్రావణ్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.