సోలార్ ప్లాంట్లకు సబ్సిడీ: మంత్రి
హైదరాబాద్,అక్టోబర్8(జనంసాక్షి) : ఇండ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఒక కిలోవాట్ నుంచి ఒక మెగావాట్ వరకు అవకాశం ఇస్తామని తెలిపారు. శాసన సభలో సోలార్, పవన విద్యుత్‌పై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2023 నాటికి ఎన్టీపీసీ నుంచి 2,090 మెగావాట్లు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. ఇతర మార్గాల ద్వారా మరో 290 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. గృహ వినియోగదారులకు ఇచ్చే కరెంట్, వాడుకునే కరెంట్ మధ్య తేడాను ఆరు నెలలకోసారి లెక్కిస్తామని చెప్పారు.