సోలిపేటకు మద్దతుగా ప్రచారం
సిద్దిపేట,అక్టోబర్30(జనంసాక్షి): దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామంలో మంగళవారం తెరాస ఇంటింటి ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా సోలిపేట రామలింగరెడ్డికి మద్దతుగా హబ్సీపూర్ గ్రామంలో తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్, రేకులకుంట మల్లన్న చెర్మెన్ బండారి రామచంద్రమ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంతోప్రజల నుండి మంచి ప్రజాదరణ వస్తున్నదని అన్నారు. మళ్ళీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌నే గెలిపించుకుంటామని మరెన్నో పథకాలు ప్రవేశపెడుతున్నదని అన్నారు. రాష్ట్ర యువ నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి ,ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.