సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్టు

వాట్సాప్ గ్రూపులలో అసత్యపు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు*
*చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్*
రేగొండ (జనం సాక్షి) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పులి వెంకట్ గౌడ్ మాట్లాడారు. వాట్స్అప్ గ్రూపులో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అసత్యపు ప్రచారంతో ఓ వీడియో వైరల్ అవుతుండడంతో మేధావి అనే పేరుతో ఉన్న గ్రూప్ అడ్మిన్, టిఆర్ఎస్ నాయకుడు పట్టేం శంకర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేయగా మొగుళ్ళపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన వంగ మహేష్ సొంతగా వీడియో తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కానీ అసత్యపు ప్రచారాలు గాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయ నాయకులపై, పార్టీలపై విద్వేషాలు కలగజేసే పోస్టులను పెట్టొద్దని తెలిపారు. వ్యక్తిగత పరువు ప్రతిష్టలు పోయే విధంగా వీడియోలు తయారు చేసి పెట్టడం గాని, ఫోటోలు పెట్టడం కానీ చేస్తే చర్యలు తప్పవని అన్నారు. పోస్టులు పెట్టిన వారిపై నే కాకుండా షేర్ చేసిన వారి పైన కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియా గ్రూపులపై పోలీస్ నజర్ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సై మహేందర్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు