స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం

7

స్వల్ప లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ా’ాదించిన కివీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. స్కాటిష్‌ జట్టు నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 24.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ా’ాదించింది. డునెడిన్‌ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో నిన్నటి వెస్టిండీస్‌-ఐర్లాండ్‌ల మ్యాచ్‌లాగా సంచలనాలు ఏమీ నమోదు కాలేదు. కానీ, 2015 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఉన్న జట్లలో ప్రముఖంగా పేరు వినిపిస్తున్న న్యూజిలాండ్‌… పసికూన స్కాట్లాండ్‌ నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ా’ాదించడానికి ఏడు వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. స్కాట్లాండ్‌ మరో 50 పరుగులు చేసి ఉంటే కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మరింత ఒత్తిడికి గురయ్యేవారెమో.

స్కాట్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యం చిన్నదిగా ఉండటంతో న్యూజిలాండ్‌ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. 18 పరుగుల వద్ద గప్తిల్‌(17) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్‌సన్‌, కెప్టెన్‌ మెక్‌కలమ్‌తో కలిసి అదే జోరును కొనసాగించాడు. అయితే 15 పరుగులు చేసిన మెక్‌కలమ్‌.. వార్దలా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్రాస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టేలర్‌9 పరుగులకే ఔటయ్యాడు. 66 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఇలియట్‌తో కలిసి విలియమ్‌సన్‌ చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. 38 పరుగులు చేసిన విలియమ్‌సన్‌ దవె బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో 40 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కొద్దిసేపటికే ఇలియట్‌(29), అండర్సన్‌(11), రోంచ్‌(12) వికెట్లను కివీస్‌ కోల్పోయింది. చివరిగా బ్యాటింగ్‌కు వచ్చిన వెటోరి(8ళి), మిల్నే(1ళి)లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ దవె, వార్దలా చెరో మూడు వికెట్లు తీయగా, మాజిద్‌ హక్‌కు ఒక వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ 36.2 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. స్కాట్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ను కివీస్‌ బౌలర్లు దెబ్బతీశారు. 12 పరుగులకే మెక్‌లాయిడ్‌ 0, గార్డినర్‌ 0, కొయేజర్‌ 1, మామ్‌సెన్‌ వికెట్లను స్కాట్లాండ్‌ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మెకెన్‌ (56), బెర్రింగ్టన్‌ (50)లు జట్టు ఆదుకున్నారు. అడపదడపా పరుగులు చేస్తూ.. స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించారు. కివీస్‌ బౌలర్లను ప్రతిఘటించిన జోడి వీరిదే. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 97 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. నిలకడగా ఆడుతున్న వీరి జోడీని అండర్సన్‌ విడదీశాడు. 56 పరుగులు చేసిన మెకెన్‌…. మెక్‌కలమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం కొద్దిసేపటికే బెర్రింగ్టన్‌ ఔట్‌ కావడంతో స్కాట్లాండ్‌ వికెట్ల పతనం మొదలైంది. చివరకు 142 పరుగులకు స్కాటిష్‌ జట్టు ఆలౌట్‌ అయింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో వెటోరి, అండర్సన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా సౌథీ, బోల్ట్‌లు రెండేసి వికెట్లు తీశారు.