స్కాట్‌లాండ్‌పై న్యూజిలాండ్ విజయం
క్రీస్ట్‌చర్చ్,ఫిబ్రవరి17(జనంసాక్షి): ప్రపంచకప్ క్రికెట్‌లో స్కాట్లాండ్ కూడా న్యూజిలాండ్‌ను వణికించింది. స్వల్ప టార్టెట్‌ను ఛేదించేందుకు న్యూజిలాండ్ చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే చివరకు ఏడు వికెట్లు కోల్పోయి విజయంసాధించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. స్కాటిష్ జట్టు నిర్దేశిరచిన 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 24.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి చేదించింది. డునెడిన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్-ఐర్లాండ్‌ల మ్యాచ్‌లాగా సంచలనాలు ఏవిూ నమోదు కాలేదు. కానీ, 2015 క్రికెట్ ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్లలో ప్రముఖంగా పేరు వినిపిస్తున్న న్యూజిలాండ్… పసికూన స్కాట్లాండ్ నిర్దేశిరచిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించడానికి ఏడు వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. స్కాట్లాండ్ మరో 50 పరుగులు చేసి ఉంటే కివీస్ బ్యాట్స్‌మెన్ మరింత ఒత్తిడికి గురయ్యేవారు. అయితే స్వల్ప స్కోరుకే 7 వికెట్లను పడగొట్టి స్కాట్ బౌలర్లు హడలెత్తించారు