స్టేప్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌, నవంబర్‌ 26: జిల్లా కేంద్రంలో గల స్టేప్‌ కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున షార్ట్‌ర్యూట్‌  సంబంవించి కార్యాలయంలోని పైళ్లు, రికార్డులు, ఇతర ముఖ్య పేపర్లు కాలిపోయాయి. అందులోని ఏసీ గది కూడా దగ్ధమైంది. కార్యాలయం నుండి పొగలు వస్తున్నట్టు గమనించిన వాచ్‌మెన్‌ అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి కార్యాలయంలోని పైళ్లు పూర్తిగా కాలి బూడదయ్యాయి. ఇందులో భాగంగా ఫర్నిచర్‌ కూడా కాలిపోయినది వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని కార్యాలయం అధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.