* స్థానికుల విజ్ఞప్తి
గిరి ప్రసాద్ నగర్ లో దేవస్థానం పునర్నిర్మాణం
* ఆలయ నిర్మాణానికి అందరు సహకరించాలికాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 5 :- పురాతన హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన హెచ్ఎండిఏ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు స్థానికులకు మద్దతుగా నిలిచి దేవస్థానం కోసం గత 30 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలంలో పునర్నిర్మాణం చేస్తున్న దేవాలయ నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారులు కూడా సహకరించి కృషి చేయాలని గిరి ప్రసాద్ నగర్ కాలనీవాసులు ఆలయ కమిటీ సభ్యులతో పాటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా బిజెపి నాయకులు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఎండిఏ అధికారులు హెచ్ఎండిఏ భూములను పరిరక్షించేందుకోసం విధి నిర్వహణలో ఉన్న అధికారులు హెచ్ఎండిఏ స్థలంలో ఓ మసీదు నిర్మాణం ఓ చర్చి నిర్మాణం జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోకుండా చోద్యం వహించి గత 30 సంవత్సరాల నుండి స్థానికులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజలు అందుకుంటున్న ఈ దేవస్థానం అభివృద్ధి కోసం పునర్నిర్మానాన్ని చేపడుతుంటే హెచ్ఎండిఏ అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆలయ నిర్మాణం కోసం అధికారులు స్థానిక పాలకమండలి సభ్యులు రాజకీయాలకతీతంగా పలు పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు అందరు కృషిచేసి ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వేడుకున్నారు