స్పేషన్ స్టేషన్ క్యాప్సూల్‌కు రంధ్రం
అప్రమత్తమైన పరిశోధకులు
హూస్టన్,ఆగస్ట్31(జనం సాక్షి): అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఎయిర్ లీకవుతోంది. అయితే అక్కడున్న వ్యోమగాములు ఆ లీకులకు మరమ్మత్తులు చేస్తున్నారు. స్పేస్‌స్టేషన్ క్యాప్సుల్‌లో ఓ చిన్న రంధ్రం పడింది. ఆ క్యాప్సుల్ నుంచే భూమి విూదకు వ్యోమగాములను పంపించాల్సి ఉంది. అయితే అంతరిక్షం నుంచి ఓ శిథిలం ఢీకొట్టడంతో.. పరిశోధనా కేంద్రానికి ఈ డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఆరుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం లేదని హూస్టన్, మాస్కోలోని మిషన్ కంట్రోల్ సెంటర్లు పేర్కొన్నాయి. గ్రహశకలాలతో స్పేస్ స్టేషన్‌కు ప్రమాదమే ఉన్నా.. వాటిని తట్టుకునే విధంగానే దాన్ని నిర్మించారు. వాస్తవానికి స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఎయిర్ ప్రెజర్ సెన్సార్ల ద్వారా .. క్యాప్సుల్‌లో లీకైనట్లు మిషన్ కంట్రోలర్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్టోన్రాట్స్ నిద్రలో ఉన్నారు. రష్యాకు చెందిన సోయేజ్ వ్యోమనౌకలో లీకేజీ ఉన్నట్లు తేల్చారు.