స్మార్ట్ సిటీలో వీధి కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలనీ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 19(జనం సాక్షి)
స్మార్ట్ సిటీగా ఉన్న కరీంనగర్లో వీధి కుక్కలు కోతులు పందుల బారి నుండి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కు మరియు నగర మేయర్ కు ప్రజలపై పన్నులు వేయడంలో ఉన్న శ్రద్ధ, ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు
సుభాష్ నగర్,హౌసింగ్ బోర్డ్, కిసాన్ నగర్,సప్తగిరి కాలనీ లలో వీధి కుక్కలు అనేకం ఉన్నాయని,మోటార్ సైకిల్ పై వెళుతున్న వారిని వెంబడించి గాయాలు చేస్తున్నాయని,చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*ఈ మధ్యకాలంలోనే హనుమాన్ నగర్ లో కోతులు ఇంటి లోనికి వెళ్లి దాడి చేయగా హార్ట్ ఎటాక్ వచ్చి ఒకరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు*n
భగత్ నగర్,జ్యోతి నగర్ తదితర ప్రాంతాలలో కోతులు విచ్చలవిడిగా ఉన్నాయని, కోతుల బారి నుండి ప్రజలను రక్షించాలని కోరారు.
అలాగే విచ్చలవిడిగా పందులు ఇండ్లలోనికే వస్తున్నాయని ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండడం మూలంగా దోమలు పెరిగిపోయి నగరంలో ఉన్న ప్రజల్లో ఇంటికొకరు విష జ్వరాల బారిన పడుతున్నారని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు
నగర కార్పొరేటర్లకు ప్రజలు అనేకమార్లు విన్నవించిన వీధి కుక్కలు,కోతులు, పందులను తరలించడం లేదని,ఇప్పటికైనా నగర మేయరు,మున్సిపల్ కమిషనర్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన కోతులు,వీది కుక్కల బెడద నుండి నగర ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఎరుకల సోదరులకు సిటీ చివరన పందుల పెంపకానికి ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించి,పందుల పెంపకానికి రుణ సౌకర్యం కల్పించాలని కోరారు
అనంతరం డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్,ఎస్.రజనీకాంత్ నగర కమిటీ సభ్యులు జి.తిరుపతి కొంపల్లి సాగర్,నాయకులు కవంపల్లి అజయ్,కోనేటి నాగరాణి,డి.అన్నపూర్ణ మాదాసు యమున,ఎన్ లావణ్య, గాజుల కనకరాజు ఎం అర్జున్ కండె రాజు చెలికాని శ్రీనివాస్,పి.రాజు, గజ్జల శ్రీకాంత్,రోహిత్ తదితరులు పాల్గొన్నారు.