స్మితా సబర్వాల్ కేసుపై సీసీఎస్ దూకుడు
హైదరాబాద్: ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై సీసీఎస్ దూకుడు పెంచింది. ఐదుగురిని విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మరోసారి విచారణకు పిలిచి కీలక నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్మిత భర్త ఐపిఎస్ అకుల్ సభర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు కొసాగిస్తున్నారు. సీఆర్పీసీ 41ఎ ప్రకారం ఔట్‌లుక్ ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ మాధవి, మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ కృష్ణ ప్రసాద్, కార్టూనిస్టు సాహిల్ బాటియా, అవుట్ లుక్ ప్రెసిడెంట్ ఇంద్రానిల్ సహా పలువురు సీసీఎస్ పోలీసుల ఎదుట తమ న్యాయవాదితో కలిసి హాజరయ్యారు.