స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం
జగిత్యాల,నవంబర్23(జనంసాక్షి): తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి..రాజనీమా చేయించి వెనక్కి పిలవండి…ఇదీ ఓ ఇండిపెండెంట్ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల ప్రచార తిప్పలు అన్నిఇన్నీ కావు. శ్రమజీవుల పనుల్లో భాగస్వామ్యం మొదలుకొని చిన్న పిల్లలను లాలించడం, పెద్దలకు స్నానాలు చేయించడం వరకు నానా తంటాలు పడుతూ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు, ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇటువంటి ప్రచారతీరుకు దూరంగా జరిగి జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హనుమంతరావు ప్రజలతో మమేకమౌతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్ల చేతిలో చెప్పుపెట్టి ఆయన ఓటు అడుగుతున్నారు. చెప్పుతో పాటు తన రాజీనామా లేక కాపీని కూడా ఓటర్లకు ఇస్తున్నారు. కోరుట్ల అభివృద్ధికి అనేక హావిూలు ఇస్తూ తనను గెలిపించాల్సిందిగా హనుమంతరావు ఓటర్లను కోరుతున్నారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హావిూలను నెరవేర్చకపోతే తాను ఇచ్చిన చెప్పుతోనే కొట్టాల్సిందిగా ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఈ విన్నూత ప్రచార తీరు స్థానికంగా చర్చనీయాంశమౌతుంది. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగారావు, బీజేపీ నుంచి డాక్టర్ వెంకట్ బరిలో ఉన్నారు.