స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొన్న…
జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్.
జనం సాక్షి ఉట్నూర్.
సఫా బైతుల్ మాల్ సేవలు అభినందనీయమని అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. గురువారం నాడు ఉట్నూరు మండల కేంద్రంలో ని సఫా బైతుల్ మాల ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ హాజరై 40 మంది నిరుపేదలకు పెన్షన్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున పెన్షన్లుగా పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా విపత్కర పరిస్థితుల్లో సఫా బైతుల్ మాల్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టిందని గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో ఉట్నూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ భోజన సదుపాయాలు నిర్వహించినారు.పవిత్ర రంజాన్ మాసంలో రేషన్ ప్యాకేజీలు పంపిణీ రోగులను పరామర్శించడం ఆసుపత్రులను సందర్శించిన మురికివాడాల్లో పెట్రోలింగ్ వంటి అనేక సేవలు సఫా బైతుల్ ద్వారా నిర్వహిస్తున్నారని వరద పరిస్థితుల్లో సఫా బైతుల్ సేవలు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సోఫా బైతుల్ మాల్ శాఖ సభ్యులు మిర్జా ముంతాజ్ బేగ్ షేక్ అహ్మద్ ఇక్బాల్ కాంగ్రెస్ జుబేర్ ఖాన్ తిరుపతి ఆఫీస్ ముహసీన్ సిద్ధిఖి ఆఫీస్ సాజిద్ సిద్ధిఖి షేక్ ఆఫీస్ సమీర్ జావిద్ ఖాన్ అబ్దుల్ ఆఫీస్ నోమాని లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి తదితరులు ఉన్నారు.