స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రం లో ప్రీడం ర్యాలీ నిర్వహణ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వతంత్ర భారత దేశంలో ప్రజలు నేడు ఆనందంగా ఉన్నారని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్రను,స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు స్వాతంత్ర్య వజ్రొత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారని తెలిపారు. స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ లో ఎన్.ఎస్.ఎస్.,ఎన్.సి.సి.,స్కౌట్స్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,వివిధ శాఖల అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు ఎన్.జి. కళాశాల నుండి రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ప్రీడం ర్యాలీ ని ఎన్.జి.కళాశాల వద్ద నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం, స్వాతంత్ర్య చరిత్రను బావి తరాలకు తెలియ చేయవలసిన అవసరం వుందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేయాల్సిన అవసరం ఉందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సాధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నెర్రెలు బారిన ఇక్కడి నేలలు.. ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణం,రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాతో పచ్చని పంటలతో కలకలలాడుతున్నాయని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న కళాభారతి నమూనా చిత్రాన్ని ఎమ్మెల్యే ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కరరావు, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో జగన్నాధ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి, డి.అర్.డి. ఓ. కాళిందిని, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి మక్బూల్ అహ్మద్,డి.పి.అర్. ఓ. శ్రీనివాస్,కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కమిషనర్ కె వి. రమణాచారి తోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ,పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

తాజావార్తలు