స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాల రికవరీ పనులు ఆగష్టు వరకు పూర్తి చేయండి : అధికారులతో కలెక్టర్ శ్రీ హర్ష

 

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 29 : జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాలు రికవరీ పనులు ఆగష్టు వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు సెర్ప్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు పనితీరుపై మండలం వారిగా రివ్యూ చేశారు. జిల్లాలోని ఎస్ హెచ్ జి గ్రూపులకు బ్యాంక్ ల ద్వారా ఎంటర్ ప్రైజెస్ కింద 2194 బ్యాంక్ రుణాలు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 538 వరకు మాత్రమే బ్యాంక్ రుణాలు రికవరీ చేయడం జరిగిందని, మిగతా వాటిని కూడా ఆగష్టు వరకు రికవరీ చేయాలనీ అన్నారు. మండలం వారిగా పూర్తి చేయాల్సినవి చాలా పెండింగ్ ఉన్నవని రికవరీ చేయిoచని మండలాల ఏ పి ఎం ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో బకాయి పడ్డ సంఘాల అమౌంట్ 3.49% ( పర్సెంటేజి) ఉందని, దానిని 1 % పర్సెంటేజికి తగ్గించే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు రుణాలను లింకేజీ చేయాలన్నారు. ప్రతి మండలంలో గ్రూప్ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాల రికవరీ పై వారికీ అవగాహన కలిపించి రుణాలు రికవరీ పూర్తి అయ్యేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు. .
ఈ సమావేశంలోఇంచార్జి డి ఆర్ డి ఏ నాగేంద్రం , , అడిషనల్ డి ఆర్ డి ఎ సరోజ, డిపిఎం రామ్మూర్తి ,ఏ పీ ఎం లు తదితరులు పాల్గొన్నారు