స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్
జగిత్యాల టౌన్, జూన్13 (జనంసాక్షి)
స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మన విద్యారంగం వికాసవం తమవు తుందన్నారు. టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనగా మంచి గురువులు దొరికిన విద్యార్థి అదృష్టవం తుడు అవుతాడని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన గురువులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చుక్కా రామయ్య కూడా తన గురువని వారి పర్య వేక్షణలో నడిపిస్తున్న ఈ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి కృషి చేస్తే ఏదైనా సాధించగలు గుతారన్నారు. రేపటి భారత దేశాన్ని, రేపటి తెలంగాణ తరాన్ని ఉపాధ్యాయులు తయారు చేస్తారని, గొప్ప విద్యార్థులను విద్యావేత్తలను తయారు చేయాలన్నారు. తొందర్లోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతుందని, జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం వారు తగు ప్రోత్సాహం లేక వెనుకబడి ఉన్నారని అన్నారు. విద్యా అనేది బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దుతుందని, ఈ విద్యాసంస్థ తెలంగాణ ప్రాంతానికి గర్వకారణంగా ఉండాలని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి శాసన సభ్యులు కొప్పుల ఈశ్వర్, కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ , వరంగల్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్సీ నారదాసు లక్షణరావు , జగిత్యాల ఆర్డీవో యం. హనుమంతరావు , ఎఎస్‌పీ రమారాజేశ్వరీ, వోరుగంటి రమణారావు, జితేందర్‌రావ్, బండ భాస్కర్ రెడ్డి, గుడిసెల రాజేశం గౌడ్, రవీందర్ సింగ్, డా. గంగారెడ్డి, జేశెట్టి రమణయ్య, విద్యార్థులు , అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.